బాలుడి తండ్రిపైనే ఆరోపణలు…
బాలుడి తండ్రిపైనే ఆరోపణలు…
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో 11ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నాయుడుగూడెంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో రిషిబాబు అనే బాలుడు ఇంటి బయట మంచంపై మృతిగా కనిపించాడు. బాలుడి శరీరంపై గాయాలుండటంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో బాలుడి తండ్రిపైనే హత్య ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
బాలుడు నల్లగా ఉన్నాడనే కారణంతో, తనకు పుట్టలేదన్న అనుమానంతో వినోద్ అనే వ్యక్తి భార్య, కుమారుడిని చాలా ఏళ్లుగా వేధిస్తున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని చెబుతున్నారు.
ఇంటి బయట మంచంపై రిషిబాబు మృతిచెందినట్లు కనిపించాడు. బాలుడి శరీరంపై గాయాలు ఉండటంతో తండ్రే హత్య చేశాడని బాలుడి తాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
