Trump Angry ఈ షరతులు ఆమోదం కాదు Andhra Prabha Top Story
Trump Angry ఈ షరతులు ఆమోదం కాదు Andhra Prabha Top Story
- ట్రంప్ యాంగ్రీ..
- అయితే సరే.. ఇరాన్ రివర్స్ షాక్
- మా జాతి హక్కుకే ప్రాధాన్యం
- ఆంక్షల ఎత్తివేత..భారీ నష్టపరిహారం
- ఇరాన్ కొత్త డిమాండ్లతో రివర్స్ షాక్
- పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
- యుద్ధం ఇంకా ముగియలేదన్న నెతన్యాహు
- లెబనాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు
- పశ్చిమాసియాలో యుద్ధనౌకల కదలికలపై ఆందోళన
( ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి)

ప్రపంచ ఆర్థిక సంక్షోభం… పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితితో అమెరికా తల్లడిల్లిపోతోంది. మరీ ముఖ్యంగా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దూసుకు వస్తున్న తరుణంలో.. రిపబ్లికన్ పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడింది. ఇక ఇరాన్ తో యుద్ధానికి తెరదించటమే లక్ష్యంగా.. అమెరికా సంధించిన రాజీతంత్రం ఫలించటం లేదు. అమెరికా ప్రతిపాదనలకు వివిధ తిరకాసులతో ఇరాన్ ఏకుమేకై.. అమెరికాను అల్లాడిస్తోంది. యుద్ధ విరమణకు అమెరికా పంపిన ప్రతిపాదనలకు ఇరాన్ ప్రతిగా … సూటిగా పంపిన తాజా షరతులకు అమెరికా అధ్యక్షుడు తలపట్టుకున్నారు.
Trump Angry : ఆడుకోవద్దు : ట్రంప్
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు లక్ష్యంతో అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ ఇచ్చిన ప్రతిస్పందన “పూర్తిగా ఆమోదయోగ్యం కాదు” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఈ చర్చలలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు ఇరాన్ తన ప్రతిస్పందనను తెలియజేసిందని ఇరాన్ మీడియా నివేదించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ 47 ఏళ్లుగా అమెరికాతో ఆడుకుంటోందని మండిపడుతూ, తమ నిబంధనలకు అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు (బాంబు దాడులు) ఉంటాయని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ పట్టించుకోలేదు,
Trump Angry : ఇరాన్ తిరకాసు
అమెరికా ప్రతిపాదనలకు… ఇరాన్ సపమాధానం ఇది. కేవలం యుద్ధ విరమణ మాత్రమే కాదు, శాశ్వత శాంతికి మొగ్గు చూపుతూ కొన్ని డిమాండ్లను ఉంచింది. లెబనాన్ సహా అన్ని రంగాల్లో తక్షణమే యుద్ధం ముగియాలి. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి, అక్కడ నౌకల రాకపోకలకు కొత్త ప్రోటోకాల్‌ను రూపొందించాలి. తమపై ఉన్న అన్ని ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి, బిలియన్ల కొద్దీ స్తంభింప జేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి. ఈ యుద్ధంతో జరిగిన నష్టానికి అమెరికా నుండి సుమారు $270 బిలియన్ల నష్టపరిహారం కోరింది. అమెరికా కోరిన విధంగా తన యురేనియం నిల్వలను అప్పగించే ప్రణాళికను ఇరాన్ తోసిపుచ్చింది
Trump Angry : ఆయనకు నచ్చకపోతే.. పోనీ
ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందనను ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు. ఆయన ప్రతిచర్య తమను ఆశ్చర్యపరచలేదని ఇరాన్ అధికారులు అన్నారు. “ఇరాన్ స్పందనపై ‘అమెరికా అధ్యక్షుడు అని పిలవబడే వ్యక్తి’ ప్రతిచర్యను మనం ఇప్పుడే చూశాం. అది పట్టింపు లేదు; “ఇరాన్ తన జాతి ప్రాథమిక హక్కులను నొక్కి చెబుతుంది” ట్రంప్ మితిమీరిన డిమాండ్లకు లొంగిపోయేలా బలవంతం చేసే ప్రయత్నంగా టెహ్రాన్ భావించిన వాషింగ్టన్ మునుపటి ప్రణాళికను ఈ స్పందన తిరస్కరించిందని అధికార వర్గం తెలిపింది. “ట్రంప్‌ను మెప్పించడానికి ఇరాన్లో ఎవరూ ప్రణాళిక రాయరు. సంప్రదింపుల బృందం కేవలం ఇరాన్ జాతి హక్కుల కోసమే రాస్తుంది. ఒకవేళ ట్రంప్ దానితో సంతోషంగా లేకపోతే, అది వాస్తవానికి మంచిదే,” అని ఆ వర్గం పేర్కొంది. “ట్రంప్‌కు వాస్తవికత అంటే ఇష్టం లేదు; అందుకే ఆయన ఇరాన్ చేతిలో పదేపదే ఓడిపోతున్నారు.” ఇరాన్ సంప్రదింపుల బృందం “ఇరాన్ ప్రజలను” కేంద్రంగా చేసుకుని ఒక ప్రతిపాదనపై పనిచేస్తోందని ఈ నివేదిక జోడించింది. “ట్రంప్ సంతోషంగా లేనప్పుడు, అది సాధారణంగా మంచిది” అని అదే వర్గం ఇంకా పేర్కొంది. ఇరాన్ చమురు ట్యాంకర్లు లేదా వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడి జరిగినా, పశ్చిమ ఆసియా అంతటా ఉన్న అమెరికా స్థావరాలు , “శత్రు నౌకలపై” దాడులకు దారితీస్తుందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించింది.
Trump Angry : పశ్చిమాసియాలో అదే స్థితి
ఈ వారాంతంలో లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. ఈ దాడులలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించగా, నబాటియే గవర్నరేట్‌లోని విద్యుత్ కేంద్రం దెబ్బతింది. హోర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య ప్రవాహాలను పునరుద్ధరించే లక్ష్యంతో రూపొందించిన సైనిక ప్రణాళికలపై చర్చించడానికి యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ మంగళవారం సంయుక్తంగా రక్షణ మంత్రుల బహుళజాతి సమావేశాన్ని నిర్వహిస్తాయని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాంతానికి యుద్ధనౌకలను పంపవద్దని ఇరాన్ ఆ రెండు దేశాలను హెచ్చరించిన కొన్ని గంటలకే ఈ ప్రకటన వెలువడింది.
Trump Angry : ఇరాన్‌పై యుద్ధం ఆగలేదు : నెతన్యాహు

ఇరాన్‌పై యుద్ధం ఇంకా ముగియలేదని, టెహ్రాన్ సుసంపన్నత కేంద్రాలు ఈ ప్రాంతమంతటా అది మద్దతు ఇచ్చే సమూహాలపై ఇంకా చర్యలు తీసుకోవలసి ఉందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్ మద్దతు ఉన్న ప్రాక్సీలతో పాటు, ఇంకా కూల్చివేయవలసిన సుసంపన్న కేంద్రాలు ఉన్నాయని నెతన్యాహు అన్నారు. “చేయవలసిన పని ఇంకా ఉంది,” అని ఆయన అన్నారు.
