కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల దరఖాస్తుల స్వీకరణ రేపు

కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల దరఖాస్తుల స్వీకరణ రేపు

కడెం, ఆంధ్రప్రభ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తరి శంకర్ తెలిపారు.

ఈ కార్యక్రమం మే 11 సోమవారం ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ హోటల్ లో నిర్వహించబడుతుందని చెప్పారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ అభ్యర్థుల నుండి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్ష పదవులకు దరఖాస్తులు స్వీకరిస్తారని వెల్లడించారు.

కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బోజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, ముధోల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి, రేఖ శ్యామ్ నాయక్ తదితరులు హాజరవనున్నట్లు తెలిపారు.

అలాగే నిర్మల్ గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ అర్జుమద్ అలీ, పీసీసీ జనరల్ సెక్రటరీ ఏంబడి రాజేశ్వర్, మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి, మాజీ జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు.యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, రైతు సంఘాల నాయకులు, టౌన్ అధ్యక్షులు, దేవస్థానాల చైర్మన్లు, ఆత్మ చైర్మన్లు, మండల అధ్యక్షులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, కౌన్సిలర్లు మరియు మాజీ కౌన్సిలర్లు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తరి శంకర్ పిలుపునిచ్చారు.