ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని సబ్ స్టేషన్లు ఏర్పాటు

పెనమలూరు, ఆంధ్రప్రభ ; పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామంటున్నామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు పట్టణంలో మూడున్నర కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నియోజకవర్గంలో సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతినిత్యం కరెంటు కోరుకునే ప్రజలు సబ్ స్టేషన్ల నిర్మాణం ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు విషయంలో తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో పెట్టొద్దు అంటూ ఆందోళన చేయడం సరికాదన్నారు. అమరావతి కంటే వేగంగా పెనమలూరు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్లు వల్లభనేని సత్యనారాయణ, జంపాన పూర్ణచంద్రరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్ తో పాటు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply