వైభవంగా ముగిసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ముగిశాయి. సుప్రభాత సేవలో భాగంగా దేవాలయం లో తెల్లవారుజామున స్వామి వారికి అభిషేకం, వివిధ పుష్పాలతో అలంకరించారు. అర్చనలు, పూజ కార్యక్రమా లను నిర్వహించారు. స్వామి వారి ఉత్సవమూర్తులను దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో, స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో, దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటికీటలాడింది.

స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కు బడును తీర్చుకున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం దేవాలయం నుండి బయలుదేరి, మండలంలోని ఆమిద్యాల గ్రామంలోని పెన్నా ఓబులేసు ఆలయానికి చేరాయి. ఈ కార్యక్రమంలో ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు, ధర్మకర్తల కమిటీ సభ్యులు రామకృష్ణ, ధనంజయ ఆచారి, చంద్రమౌళి స్వామి, టిడిపి నాయకులు మోపిడి గోవిందు, ఇంద్రావతి సుధాకర్, ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు, అర్చకులు బాలాజీ చార్యులు, గుండురావు పాల్గొన్నారు.
