year2027 | స్నాక్స్‌.. ఇక ప్రియం

year2027 | స్నాక్స్‌.. ఇక ప్రియం

year2027 | బిస్కెట్ పై కూడా యుద్ధం కాటు
ధ‌ర‌లు పెంచ‌బోతున్న బ్రిటానియా
గోధుమ‌, కోకో, ఆయిల్ ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే కార‌ణం
వార్‌తో దిగుమ‌తుల ప్ర‌క్రియ‌లో ఆటంకాలు
స‌రుకు ర‌వాణా చార్జీలు, బీమా ధ‌ర‌లు పెర‌గ‌డ‌మూ కార‌ణమే..
ఇక.. రూ.5కు బ్రిటానియా బిస్కెట్ ప్యాక్ గ‌గ‌న‌మే

year2027 | న్యూ ఢిల్లీ,ఆంధ్ర‌ప్ర‌భ : ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లు.. రెండు దేశాలు యుద్ధం చేసుకుంటే దాని ప్రభావం ప్రపంచంపై పడుతోంది. పశ్చిమాసియాలో ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన వంటింట్లో ఉండే బిస్కెట్ ప్యాకెట్ ధర పెరగడం వినడానికి వింతగా అనిపించినా, ఇది నేటి గ్లోబల్ మార్కెట్ వాస్తవం. యుద్ధం వల్ల కేవలం ప్రాణనష్టమే కాదు, అది అంతర్జాతీయ సరఫరా గొలుసును దెబ్బతీసి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. ఉదయం టీతో పాటు తినే చిన్న బిస్కెట్ ప్యాకెట్ ధర కూడా మారబోతోందన్న వార్త ఇప్పుడు మధ్యతరగతి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆహార రంగంపై యుద్ధ ప్ర‌భావం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లను అస్థిరపరుస్తోంది. దీని ప్రభావం ఆహార రంగంపై కూడా పడడంతో ప్రముఖ బిస్కెట్ల తయారీ సంస్థ బ్రిటానియా కీలక ప్రకటన చేసింది. ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో తమ ఉత్పత్తుల రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని సంస్థ వెల్లడించింది. ఒక్క బిస్కెట్ పైనే కాదు బ్రిటానియా సంస్థ రూపొందించే ప్ర‌తి స్కాక్స్ ప్యాక్ కూడా ధ‌ర‌లు పెంచ‌నుంది.

బిస్కెట్లకు యుద్ధానికి సంబంధం ఏమిటీ?
యుద్ధం నేరుగా బిస్కెట్ల తయారీపై ప్రభావం చూపడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. బిస్కెట్ల తయారీలో వాడే కీలకమైన పిండి, కోకా , ముఖ్యంగా పామాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోయాయి. యుద్ధం కారణంగా ఈ వస్తువుల ఎగుమతులు, దిగుమతులకు ఆటంకం ఏర్పడటమే దీనికి కారణం. యుద్ధం వల్ల సముద్ర మార్గాల్లో నౌకల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. దీనివల్ల బీమా ఖర్చులు, ఇంధన ధరలు పెరిగి, రవాణా చార్జీలు భారంగా మారాయి. ఈ అదనపు భారం చివరికి వినియోగదారుడిపైనే పడుతోంది.

ఎప్పటి నుంచి అమల్లోకి..?
బిస్కెట్ల తయారీలో దిగ్గజం బ్రిటానియా.. ఈ పెంపుపై స్పష్టత ఇచ్చింది. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (అంటే ఏప్రిల్, 2026 తర్వాత) నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి రానుంది. ధరలను ఎంత శాతం పెంచుతారనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ముడిపదార్థాల ఖర్చులను బట్టి ఈ సర్దుబాటు ఉంటుందని పేర్కొంది. సామాన్యుడిపై ఆర్థిక భారం బిస్కెట్లు అనేవి కేవలం పిల్లల ఆహారం మాత్రమే కాదు, టీ టైమ్ లో ప్రతి ఇంటిలోనూ ఉండే కనీస అవసరం. సాధారణంగా కంపెనీలు రూ. 5 లేదా రూ. 10 ప్యాకెట్ల ధరను పెంచడానికి బదులు, అందులో ఉండే బిస్కెట్ల పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, ఇలా స్నాక్స్ ధరలు కూడా పెరగడం సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌ను దెబ్బతీసే అంశమే. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప చమురు, ముడిపదార్థాల ధరలు అదుపులోకి వచ్చేలా లేవు. బ్రిటానియా బాటలోనే ఇతర ఎఫ్ఎంసీజీ కంపెనీలు కూడా నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం అనేది కేవలం సరిహద్దులకు పరిమితం కాదని, అది మన నిత్యావసరాల వరకు విస్తరిస్తుందని ఈ పరిణామాలు గుర్తు చేస్తున్నాయి.

CLICK HERE TO READ ర‌ష్యాకు ఉత్త‌ర‌కొరియా సాయం

CLICK HERE TO READ MORE