వత్సవాయిలో చలివేంద్రం ప్రారంభం..

వత్సవాయిలో చలివేంద్రం ప్రారంభం..

  • ప్రజాసేవే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు
  • కేడిసిసి చైర్మన్ నెట్టెం రఘురాం
  • కేడీసీసీ సేవలు అభినందనీయం
  • ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య

వత్సవాయి, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం వత్సవాయి గ్రామంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేడీసీసీ బ్యాంక్ వత్సవాయి బ్రాంచ్ ఆధ్వర్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెట్టెం శ్రీ రఘురాం, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ.. కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది, సహకార సంఘాల అధ్యక్షుల సమన్వయంతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మండుతున్న ఎండల్లో బాటసారుల దాహార్తిని తీర్చడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేడీసీసీ బ్యాంక్ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తోందని, ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సమయంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు.

ప్రజలకు అండగా నిలుస్తూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న కేడీసీసీ బ్యాంక్ మరింత విస్తృత స్థాయిలో సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సహకార సంఘాల అధ్యక్షులు, కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.