Rs 50 Crore Fixed Deposits అదే అవినీతి కంపు Andhra Prabha Top Story

Rs 50 Crore Fixed Deposits అదే అవినీతి కంపు Andhra Prabha Top Story

  • శ్రీ వ్యాసాశ్రమంపై భారీ ఆరోప‌ణ‌లు
  • కోట్లకు కోట్లు దుర్వినియోగం
  • నిబంధ‌ప‌ల‌కు విరుద్దంగా ఆస్తుల విక్రయం
  • మూతపడిన సేవా సంస్థలపై ఆవేదన
  • కన్యా గురుకులం ఘటనల ప్రస్తావన
  • విజిలెన్స్ విచారణకు డిమాండు
  • పీఠాధిపతిని తొలగించాలని ఫిర్యాదు
  • రాష్ట్రపతికి గాలి ర‌వి విన‌తి

( ​ఏర్పేడు, ఆంధ్రప్రభ ):

Rs 50 Crore Fixed Deposits : అందుగ‌లడు.. ఇందు లేడ‌ని సందేహంబు వ‌ల‌దు.. ఎందెందు వెతికినా అవినీతి కంపు రాజ్యమేలు… అనే రీతిలో చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ వ్యాసాశ్రమం వివాదాలకు నిలయంగా మారింది. గత 15 ఏళ్లుగా ఆశ్రమంలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, ప్రస్తుత పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామిని తక్షణమే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏర్పేడుకు చెందిన గాలి రవి భారత రాష్ట్రపతికి లేఖ రాశారు. ​ఆశ్రమ నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఫిర్యాదులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి:

Rs 50 Crore Fixed Deposits : కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం
​దేవాదాయ శాఖ అనుమతి లేకుండానే ఆశ్రమానికి చెందిన రూ. 40 నుండి 50 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లను డ్రా చేశారని గాలి రవి ఆరోపించారు. భక్తులు ఇచ్చే విరాళాలకు ఎలాంటి లెక్కలు చూపడం లేదని, ఆర్థిక వ్యవహారాలన్నీ పారదర్శకత లేకుండా సాగుతున్నాయని పేర్కొన్నారు.

Rs 50 Crore Fixed Deposits : నిబంధనలకు విరుద్ధంగా ఆస్తుల విక్రయం

​ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఆశ్రమ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఫిర్యాదులో వివరించారు. ముఖ్యంగా:
​ఆమందూరు క్వార్టర్స్, చిత్తూరులోని పరాశర్య ప్రింటింగ్ ప్రెస్ విక్రయం.
​ఆశ్రమానికి చెందిన విలువైన భూములను అక్రమంగా అమ్మడం.

Rs 50 Crore Fixed Deposits : మూతపడిన సేవా సంస్థలు

​పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన కంటి ఆసుపత్రి, అనాథ శరణాలయం, సంస్కృత పాఠశాలలను మూసివేశారని, ఆశ్రమ మూల ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగుతోందని రవి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విరాళాల సేకరణ కోసమే ‘యథార్థ భారతి’ పత్రికను వాడుకుంటున్నారని విమర్శించారు.

​Rs 50 Crore Fixed Deposits : తీవ్రమైన ఆరోపణలు

​కన్యా గురుకులంలో గతంలో జరిగిన లైంగిక వేధింపుల కేసులను పీఠాధిపతి నీరుగార్చారని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గాలి రవి ప్రభుత్వాన్ని ఈ క్రింది విధంగా డిమాండ్ చేశారు . ​పీఠాధిపతి తొలగింపు: ప్రస్తుత పీఠాధిపతిని వెంటనే పదవి నుండి తొలగించాలి. ​ప్రభుత్వ స్వాధీనం: ఆశ్రమాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని ప్రత్యేక అధికారిని నియమించాలి. ​విజిలెన్స్ విచారణ: గత 15 ఏళ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలి. ​ఈ అక్రమాలపై తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని గాలి రవి స్పష్టం చేశారు.

Leave a Reply