2027Dec | తొలి దశ పనులకు రూ.7,055 కోట్లు
2027Dec | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మూసీ ప్రాజెక్టుపై మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం నిర్వహించింది. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ వివరాలను అధికారులు మంత్రులకు వివరించారు. తొలి దశ పనుల కోసం ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)తో చర్చలు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.
మొదటి దశలో రూ.7,055 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. నిర్మాణాలపై ప్రభావం తక్కువగా ఉండేలా తొలి దశలో 5 కిలోమీటర్ల పరిధిలో పనులు ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. అవసరమైన చోట అలైన్‌మెంట్‌ను మార్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆగస్టు నాటికి పనులు ప్రారంభించి 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాజెక్టు అమలు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులకు సూచించారు. వర్షాకాలంలో పనులకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇక మూసీ నదిపై ఏర్పాటు చేయనున్న రబ్బర్‌డ్యామ్ నమూనాలను కూడా మంత్రుల ఉపసంఘం పరిశీలించింది.
