శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం

  • ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తా…
  • సుల్తానాబాద్ నూతన సీఐ రంజిత్ రావ్

సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని సుల్తానాబాద్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన పొన్నమనేని రంజిత్ రావ్ పేర్కొన్నారు. గతంలో సుల్తానాబాద్లో విధులు నిర్వహించిన సీఐ సుబ్బారెడ్డి హైదరాబాద్ మల్టీ జోన్ ఐజి కార్యాలయానికి బదిలీ కాగా, వరంగల్ జిల్లా శాయంపేటలో విధులు నిర్వహిస్తున్న రంజిత్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సీఐ రంజిత్ రావు మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తానని, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యమన్నారు. సర్కిల్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా మత్తు పదార్థాలలు గంజాయి వంటివి శాశ్వతంగా నిర్మూలించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, పొత్కపల్లి, ఎలిగేడు, జూలపల్లి ఎస్ఐలు పి.చంద్రకుమార్, దీకొండ రమేష్, ఎస్. వెంకటేష్, సీహెచ్ సనత్ కుమార్, ఎల్.మధుకర్ తోపాటు సుల్తానాబాద్- 3 ఎస్సై అశోక్ రెడ్డి, సర్కిల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.