1st year I ప్రాణం తీసుకున్న విద్యార్థిని!

1st year I ప్రాణం తీసుకున్న విద్యార్థిని!

1st year I జన్నారం, ఆంధ్రప్రభ: ఈ కాలం పిల్లలకు మంచి చెప్పినా.. దానిలో తప్పునే వెతుకుతున్నారు. చిన్నచిన్న విషయాలకే అలిగి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది. టీవీ చూడొద్దని తల్లిదండ్రులుమందలించినందుకు డిగ్రీ విద్యార్థిని గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రోటిగూడకు చెందిన మోత్కూరి అక్షయ(19) డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతుంది. తరచూ టీవీ చూస్తుండటంతో.. తల్లిదండ్రులు చదువుకోవాలని టీవీ చూడొద్దని మందలించారు.

దీంతో మనస్థాపానికి గురైన అక్షయ ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకొని గడ్డి మందు తాగింది. కూతురు పరిస్థితిని గమనించిన తల్లి వచ్చి అక్షయను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. అయితే పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ.. గురువారం తెల్లవారుజామున అక్షయ మృతి చెందింది. ఈ విషయమై మృతురాలు తండ్రి లక్ష్మీనారాయణ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ సాయంత్రం తెలిపారు.