సర్కిల్ పరిధిలో 21 మంది పోలీస్ సిబ్బంది బదిలీ..

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; బిక్కనూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో 21 మంది పోలీస్ సిబ్బంది బదిలీ అయినట్లు సీఐ జగడం నరేష్ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలోని ఐదు సంవత్సరాల పాటు పలు పోలీస్ స్టేషన్లో పనిచేసిన వారిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బదిలీ చేశారన్నారు.

బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఐదుగురు, దోమకొండ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఐదుగురు, బీబీపేట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎనిమిది మంది, రాజంపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ముగ్గురు పోలీస్ సిబ్బంది బదిలీ అయినట్లు ఆయన వివరించారు. వారి స్థానంలో 22 మందిని జిల్లా అధికారులు నియమించినట్లు వివరించారు.