Governor | ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
Governor | ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
Governor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ఆసక్తికరంగా మారిన వేళ టీవీకే చీఫ్ విజయ్ మరోసారి గవర్నర్‌ను కలిశారు.
ఇవాళ విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను లోక్‌భవన్‌లో కలిసి రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఇంకా దక్కకపోవడంతో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇప్పటికే బుధవారం కూడా విజయ్ గవర్నర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ వరుస భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
