మోదీ సభకు భారీగా తరలి రావాలి
మోదీ సభకు భారీగా తరలి రావాలి
ఆలేరు,ఆంధ్రప్రభ : ఈనెల 10న సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరగనున్న ప్రధాని మోడీ పాల్గొనే బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ బిజెపి కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ అధ్యక్షులు నంద గంగేష్,మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మాధురి చంద్ర బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కామిటికారి కృష్ణ,జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డెమాను నరేందర్,పట్టణ కార్యదర్శి ఏలుగల వెంకటేష్ సీనియర్ నాయకులు మల్ రెడ్డి నర్సింహా రెడ్డి, బడుగు జహంగీర్, కొమురయ్య అమృతం నర్సింముల్లు, నాయకులు కళ్లెం రాజు, అయిలి సందీప్, కంతుల శంకర్, రచ్చ రాము,మహిళా నాయకురాలు సముద్రాల కల్పన,మంజుల, రచ్చ శైలజ, విజయ పాల్గొన్నారు.
