ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఈ నెల 20న జరిగే తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేష్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే కళా ఉద్యమాలకు ప్రజానాట్య మండలి ఎప్పటికప్పుడు ముందుంటుందని తెలిపారు.

జిల్లాలోని అన్ని మండలాల నుంచి కళాకారులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు నాటకాలు ప్రజా చైతన్య గీతాలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణలు నిర్ణయించేందుకు ఈ మహాసభలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

అనంతరం జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి, పార్టీ నారాయణపురం మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, పార్టీ జిల్లా సమితి సభ్యుడు కలకొండ సంజీవ, మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, మారగోని నాగరాజు, పల్లె గోపాల్ రెడ్డి, దాసరి అంజయ్య, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
*