బక్రీద్ వేడుకలు శాంతియుతంగా జరపాలి

బక్రీద్ వేడుకలు శాంతియుతంగా జరపాలి

  • డీఎస్పి పల్లె శ్రీనివాసులు

అచ్చంపేట, ఆంధ్రప్రభ: ఈనెల 27వ తేదీన జరగనున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని అచ్చంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పి పల్లె శ్రీనివాసులు వివిధ మతాల పెద్దలు, నాయకులతో కలిసి శాంతి సందేశాన్ని అందించారు. పండుగలను సోదరభావంతో, సామరస్య పూర్వక వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు. పట్టణంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని, నిబంధనలను అతిక్రమించకూడదని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని హెచ్చరించిన ఆయన, మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలందరూ సమన్వయంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని డీఎస్పి పిలుపునిచ్చారు.