గ్రామాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు…
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ తాళ్లపేట రేంజ్ పరిధిలోని రోటిగూడ, సింగరాయిపేట గ్రామాలలో బుధవారం డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని వడ్రంగుల, ఇతర అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఆ తర్వాత అడవుల, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మహ్మదాబాద్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శంకర్, జన్నారం డాగ్ స్క్వాడ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎల్.అనిల్ నాయక్, సింగరాయిపేట బీట్ ఆఫీసర్ అనిత, తదితరులు పాల్గొన్నారు.
