రైతు వారోత్సవాలలో ఉత్తమ రైతులకు సన్మానం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మార్కెట్ యార్డ్లో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ రైతుల సమస్యలను తెలుసుకుంటూ, వారి అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతు వారోత్సవాల సందర్భంగా రైతులతో పాటు బ్యాంకు మేనేజర్లు, మండల విస్తీర్ణ అధికారులు పాల్గొన్న సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రైతుల సమస్యలు, వ్యవసాయానికి సంబంధించిన ఆర్థిక సహాయం, రుణ సౌకర్యాలపై చర్చించారు. సమావేశం అనంతరం నలుగురు ఆదర్శ రైతులను సన్మానించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు సంతోష్, మల్లేశం, సర్పంచ్ పెద్దన్న, ఉప సర్పంచ్ మహేష్, వ్యవసాయ అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ బెజ్జంకి శాఖ మేనేజర్లు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, రైతులు, హమాలీలు మరియు ట్రేడర్లు పాల్గొన్నారు.
