ఘనంగా వేకేషన్ బైబిల్ స్కూల్ ముగింపు

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ 299 పరిధిలోని కండ్లకోయ పట్టణంలోని గుడ్ షేపర్డ్ చర్చిలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన వేకేషన్ బైబిల్ స్కూల్ (VBS) బుధవారం ఘనంగా ముగిసింది.

ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన ఈ వేసవి బైబిల్ తరగతుల్లో సుమారు 70 మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు రోజున మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక సభ్యుడు, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ దామన్నగారి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుడ్ షేపర్డ్ చర్చి పాస్టర్ రెవ. కె. కిషన్ రావు ప్రభాకర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా దామన్నగారి ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం VBSలో ఇంతమంది పిల్లలు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిన్నారులు క్రమశిక్షణతో దేవుని వాక్యంలో ఎదగాలని, గ్రామంలోని ప్రతి సంఘ సభ్యుడిని దేవుడు దీవించాలని ఆకాంక్షించారు.

బహుమతుల పంపిణీ:
శిబిరంలో పాల్గొన్న చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా టిఫిన్ బాక్సులు, కేకులు, సాఫ్ట్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కందడి శశిధర్ రెడ్డి చిన్నారుల కోసం టిఫిన్ బాక్సులను స్పాన్సర్ చేయగా, దామన్నగారి సందీప్ కేకులు మరియు బాదం మిక్స్ పానీయాలను అందించారు. ఈ ముగింపు వేడుకలో హంసరాజు, బొక్క కృష్ణారెడ్డి, యంబ రాజు, ఎర్రోళ్ల దేవేందర్, ఎర్రోళ్ల మహేష్, సంఘ సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.