లక్షేట్టిపేటలో దారుణం..

లక్షేట్టిపేటలో దారుణం..

  • ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
  • వరి ధాన్యం కాపాడుకునేందుకు వెళ్ళిన రైతులపై కూలిన గోడ
  • ఒక రైతు అక్కడికక్కడే మృతి
  • చికిత్స పొందుతూ మరో ముగ్గురు రైతుల దుర్మరణం
  • మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. జిల్లాలోని లక్షేట్టిపేట మండలంలో గోడ కూలి నలుగురు మృతి చెందారు. మండలంలో భారీ వర్షాలు ఈదురుగాలులకు కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో వరి కల్లాల్లోని ధాన్యం తడుస్తుందని ఆతృతగా రైతులు పరుగులు తీశారు. వరి ధాన్యం కాపాడడం కోసం వెళ్లిన ఆరుగురు రైతుల పై గోడ కూలింది. ఒక రైతు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు రైతులు లక్షేట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృత్యువాత పడ్డారు.

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందన
కొత్తూరు, గంపలపల్లి ప్రమాద ఘటనల పై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించారు. రైతుల మృతి అత్యంత విషాదకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు తన తరఫున ఒక్కొక్కరికి 2 లక్షల తక్షణ సాయం అందజేస్తానని ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.