రైతు సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
రైతు సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
భీమారం, ఆంధ్ర ప్రభ: గ్రేటర్ వరంగల్ ఒకటో డివిజన్ ముచ్చర్లలో బుధవారం జరిగే రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని రైతు సదస్సు పోస్టర్ ను రైతులతో కలిసి బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు చల్ల వెంకటేశ్వర్ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం 8 గంటలకు సభ ప్రాంగణానికి రైతులు, పార్టీ ప్రతినిధులు అదే తన హాజరై సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పులెంట్ల శ్రీధర్, కన్నబోయిన రాజు, బండ సాయి రెడ్డి, తేలుకుంట్ల సతీష్, రైతులు పెద్ది ఇంద్రసేనారెడ్డి, హరిప్రసాద్,గోపాల్ రెడ్డి,గణపతి రెడ్డి, ఓరుగంటి ఇంద్రన్న తదితరులు పాల్గొన్నారు.
