మొన్న పేకాట…నేడు గంజాయి!

మొన్న పేకాట…నేడు గంజాయి!

  • గంజాయి పట్టుకున్న స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులు
  • ఐదుగురిపై కేసు నమోదు
  • 50 గ్రాముల గంజాయి స్వాధీనం
  • వైద్య పరీక్షల అనంతరం జనగామ కోర్టుకు తరలింపు
  • నేరాలకు చెక్కు పెట్టేందుకు ఘన్‌పూర్ ఖాకీ ఉక్కుపాదం

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయ యత్నంపై స్టేషన్ ఘన్ పూర్ పోలీసులు చురుకైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని బలర్ష ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురిని బస్టాండ్ సమీపంలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ఆలేటి ఈశ్వర్, బొమ్మగాళ్ల శ్రీరామ్ మహారాష్ట్ర రాష్ట్రంలోని బలర్ష ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీ సులకు విశ్వసనీయ సమాచారం అందింది. సీఐ జి. వేణు ఆదేశాల మేరకు ఎస్‌ఐలు పిట్ట రాజేష్, రమేష్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో బస్టాండ్ సమీపంలో ఆలేటి ఈశ్వర్, బొమ్మగాళ్ల శ్రీరామ్ తమ స్నేహితులు చేరిపల్లి ప్రసాద్, మునిగేల రాజే ష్, జఫర్‌గడ్ మండలం కొనాయిచలం గ్రామానికి చెందిన జాటోత్ రాజే ష్ అలియాస్ నితిన్‌తో కలిసి గంజాయి విక్రయించేందుకు ప్రయత్ని స్తూ..అదే సమయంలో సేవిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికే చేరుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకుని సుమారు 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు వైద్య పరీ క్షలు నిర్వహించిన అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో జనగామ కోర్టుకు తరలించారు.

యువతను మత్తు బారిన పడనివ్వం: సీఐ జి. వేణు

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. యువతను మత్తు బారిన పడనివ్వం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా ఉంచాలని హెచ్చ రించారు. పట్టణంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసు లు మరింత కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

Leave a Reply