ప్రైవేట్ మిల్లర్ల దగ్గరకు వెళ్లి మోసపోవద్దు..
ప్రైవేట్ మిల్లర్ల దగ్గరకు వెళ్లి మోసపోవద్దు..
ప్రభుత్వ కోనుగోలు కేంద్రాల్లో రూ.500 బోనస్
సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో వడ్ల కొనుగోలు
కేంద్రాల ప్రారంభోత్సవంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలజగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రైతులారా! ప్రైవేట్ మిల్లర్ల దగ్గరకు వెళ్లి మోసపోవద్దని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో మంగళవారం పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సదాశివపేట పట్టణంలోని మార్కెట్ కమిటీతో పాటు సదాశివపేట మండలంలోని నందికంది, కొండాపూర్ మండలంలోని మారేపల్లి, కొండాపూర్, తేర్పొల్, గొల్లపల్లి, మల్కాపూర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్మలజగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రైవేట్ మిల్లర్ల వద్దకు వెళ్లి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు విక్రయించాలని సూచించారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాల్లో సన్న వడ్లు విక్రయిస్తే క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వై.ప్రభు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మస్కు అలవేణి నర్సింహరెడ్డి, వైస్ చైర్మన్ కంది కృష్ణ, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సిద్దన్న, వ్యవసాయ శాఖ అధికారులు, సదాశివపేట తహసీల్దార్ గోలి హరిచంద్రప్రసాద్, కొండాపూర్ తహసీల్దార్ అశోక్ పాల్గొన్నారు.
