మృతురాలి కుటుంబానికి పరామర్శ
మృతురాలి కుటుంబానికి పరామర్శ
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని చల్లగరిగలో ఇటీవల అనారోగ్యంతో మూలరాజమ్మ మృతి చెందారు. సోమవారం దశదినకర్మలో మృతురాలి కుటుంబాన్ని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీకృష్ణ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు, అల్లం రాజు, తదితరులు పాల్గొన్నారు.
