కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు
నిర్మాణాల తొలగింపు
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గ కేంద్రాములో కొనసాగుతున్న రోడ్డు వేడెల్పు పనులు వేగవంతం గా కొనసాగుతున్నాయి. గత మూడు రోజులనుంచి వ్యాపారాలు తమ తమ వ్యాపార భవనాలను ఖాళీ చేసుకొంటూ, మరోవైపు స్వచ్చందంగా నే నిర్మాణాలను తొలగిస్తున్నారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి పెద్ద చెరువు వరకు కొనసాగే రోడ్డు విస్తీరణ పనులలో రోడ్డు ఎంత మేరకు పెరుగనుందో అధికారుల నుంచి స్పష్టమైన క్లారిటీ లేక వ్యాపారాలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు విస్తీర్ణలో యేమేరకు పెరుగనుందో తెలియచేయాలనీ కోరుతున్నారు.




