హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ,
హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ,
చిట్యాల మే 3( ఆంధ్రప్రభ) : మండలంలోని వెంచరామి గ్రామ శివారు కుర్మపల్లి లో భక్తుల చిరకాల స్వప్నమైన శ్రీ హనుమాన్ ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు . వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈశాన్య మూలలో నిధుల నిక్షేపణ, శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాసు రమ – కుమార్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం తో గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని, గ్రామస్తుల సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, భక్తులు, పాల్గొన్నారు.
