బీఆర్ఎస్ లో చేరికలు

బీఆర్ఎస్ లో చేరికలు
తిమ్మాపూర్, ఆంధ్రప్రభ: తిమ్మాపూర్ మండల కేంద్రంలోనికాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, 1వ వార్డు సభ్యులు చిలుకూరు రాజు, ఎనిమిదో వార్డు సభ్యురాలు జక్కని నవ్యా సతీష్, బీజేపీ సీనియర్ నాయకులు జక్కుల కుమార్, బూర్ల విద్యాసాగర్ , మర్రి రమేష్, జనగం సతీష్ లు రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మాజీ సీఎం కేసీఆర్ గతంలో చేసిన సంక్షేమ పథకాలతో పాటు మానకొండూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రసమయి ఎమ్మెల్య గత అభివృద్ధి పనులకు ఆకర్షతులమై గులాబీ గూటికి చేరుతున్నట్లు నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ముందు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని కార్యకర్తలు, మండల నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, సీనియర్ నాయకులు ఎడ్ల బుచ్చిరెడ్డి,నాయిని వెంకట్ రెడ్డి,పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, మాతంగి లక్ష్మణ్, రామంచరామిరెడ్డి , బోర్ర రవీందర్, వార్డు సభ్యులు గడ్డి రమేష్, నాయకులు, పోతు రాజు దేవేందర్, వేల్పుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
