బెజ్జంకి ఎస్‌.హెచ్‌.ఓ గా తోట తిరుపతి

బెజ్జంకి ఎస్‌.హెచ్‌.ఓ గా తోట తిరుపతి

బెజ్జంకి, (ఆంధ్రప్రభ ): బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌.హెచ్‌.ఓగా తోట తిరుపతి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నివారణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్న ఆయన, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించేందుకు కృషి చేస్తానన్నారు. అన్ని శాఖలతో సమన్వయం సాధిస్తూ విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ప్రజల సహకారం ఉంటేనే పోలీసింగ్ వ్యవస్థ మరింత బలపడుతుందని, అందరూ సహకరించాలని కోరారు.