వైభవంగా పెద్ద పేట రామాలయ శంకుస్థాపన..

వైభవంగా పెద్ద పేట రామాలయ శంకుస్థాపన..

ఆకివీడు, ఆంధ్రప్రభ : ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణలో భాగంగా ఆదివారం ఉదయం 7 గంటల 14 నిమిషాలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దంపతులచే శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమం మొదట్నుంచి రామభక్తుల జైశ్రీరామ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. శాస్త్రృత్తంగా వేద పండితుల మంత్రాల నడుమ నిర్విరామంగా సాగింది. మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పోలీసుల గస్తీ..
పెదపేట రామాలయ పునర్నిర్మాణం వివాదాస్పదం కావడంతో డీఎస్పీ రఘువీర్ విష్ణు నేతృత్వంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 544 మంది పోలీస్ సిబ్బంది ఆకివీడు పట్టణ సరిహద్దుల్లో వివాదస్పద వ్యక్తులను లోపలికి రానివ్వకుండా ముందస్తు చర్యల్లో భాగంగా చెక్ పోస్ట్ ఏర్పాటుచేశారు. పోలీస్ భద్రత నడుమ శంకుస్థాపన కార్యక్రమం సజావుగా సాగింది.

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు..
రామాలయ పునర్ నిర్మాణంలో భాగంగా విజయనగరం పండితులచే ముహూర్తం ఖరారు అయిందన్నారు. ఎంతో మంది కోర్టుల ద్వారా ఆటంకాలు కలిగించాలని చూసిన మే 3వ తేదీ విజయవంతంగా శంకుస్థాపన పూర్తయిందని పేర్కొన్నారు. కోర్టులలో ఇంకెన్ని జడలు విప్పిన ఇంక ఏమి చేయలేరని విమర్శించారు. రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా కొంతమంది కేసులు వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మా సహనానికి కూడా హద్దు ఉంటుందని దాన్ని బలవంతంగా దాటేటట్టు చేయొద్దని హెచ్చరించారు.ఈ కార్యక్రమం ఎంతో మంది అదృష్ట శక్తులు పనిచేయడం వల్ల ఇంతటి విజయం లభించిందన్నారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు,ప్రభుత్వ యంత్రాంగానికి పోలీసులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply