ట్రాన్స్‌పోర్టుపై సమన్వయం లేని అధికార యంత్రాంగం..

ట్రాన్స్‌పోర్టుపై సమన్వయం లేని అధికార యంత్రాంగం..

మొక్కజొన్నల కొనుగోలు నిర్వహణ ప్రక్రియలో ఎమ్మెల్యే వైఫల్యం

నర్సంపేట, ఆంధ్రప్రభ : మొక్కజొన్నపై కొనుగోలు నిర్వహణలో ఎమ్మెల్యే విఫలంతో మార్కెట్, గోదాo, ట్రాన్స్పోర్ట్ అధికార యంత్రాంగం సమన్వయం కోల్పోయా రని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట, వరంగల్ ప్రధాన రహదారి (గురజాల క్రాస్ వద్ద) పైన బిఆర్ఎస్ ధర్నా చెప్తారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా 42 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనుగోలు చేపట్టారన్నారు.

ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రతి మండలంలో ఐదు నుంచి ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. పిఎసిఎస్, ఎఫ్ పి.ఓ, ఐకెపి మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.90 వేల ఎకరాలలో మొక్కజొన్న పంట దిగుబడి వస్తే కేవలం 7 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి రైతులను ఉద్దేశపూర్వ కంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదనీ ఆరోపించారు.

నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్లలో మక్కలు కొనుగోలు కేంద్రాలను నిలిపివేసిన ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నట్లూ తెలిపారు. ప్రైవేట్ వ్యాపారస్తులకు, దళారులకు కొమ్ము కాస్తూ రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తున్న రేవంత్ సర్కార్ కు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు దాపురిస్తాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులు కేవలం నామమాత్రపు సమీక్షలు చేస్తున్నారనీ, రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదన్నారు.

ఈ కార్యక్రమం లో నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్రావు, నర్సంపేట రూరల్ పార్టీ బాధ్యలు నామాల సత్యనారా యణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ, గోనె యువరాజ్, మోటూరిరవి, మండల శ్రీనివాస్, తాలపెల్లిరాంప్రసాద్, మాజీ పిఎసిఎస్ ఛైర్మెన్, క్లస్టర్ ఇంచార్జీలు ,మండల పార్టీ నాయకులు, రైతులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply