Tipper Lorry | అర్ధరాత్రి ఘోర ప్రమాదం

Tipper Lorry | అర్ధరాత్రి ఘోర ప్రమాదం
మంటల్లో లారీ డ్రైవర్ మృతి
Tipper Lorry |బాపులపాడు, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లీ జాతీయ రహదారి చెక్ పోస్టు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పంక్చర్ అయి ఆగి ఉన్న టీప్పర్ లారీ మరో లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో లారీ డ్రైవర్ కాలిపోయాడు. వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ తన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.


