ఏపీ మంత్రి నాదెండ్లకు పరామర్శ..

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల, వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను జనసేన ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు పరామర్శించారు.ఇటీవల మంత్రి మనోహర్ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు స్వర్గస్తులు కాగా శనివారం హైదరాబాదు లోని మంత్రి మనోహర్ గృహానికి వెళ్లి భాస్కర్ రావు చిత్రపటానికి నివాళులర్పించి పరామర్శించారు.కార్యక్రమం లో జన సైనికులు కాంపల్లి వెంకట్, రామగిరి, శివ సాయి, పున్నం రాంబాబు, మోదాల శంకర్, మేడిగ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply