జైనూర్ బాలికల ఆశ్రమ విద్యార్థుల ప్రభంజనం

జైనూర్ బాలికల ఆశ్రమ విద్యార్థుల ప్రభంజనం

జిల్లా టాపర్ లను సన్మానించిన ఎమ్మెల్యే, డిడి

జైనూర్, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలు బుధవారం విడుదల కావడంతో ఆ ఫలితాల్లో కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లాలోని అన్ని ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల కంటే జైనూర్ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమం ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా టాపర్ గా నిలిచారు. అత్యధిక మార్కులు సాధించిన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పరచకి లోకేశ్వరి542 మార్కులు, ఎం ఆర్థిక 537, ఏ,సంధ్యారాణి 535, అత్యధిక ప్రతిభ మార్కులుసాధించడంతోపాటు బాలికల ఆశ్రమోన్నత పాఠశాల 100% ఫలితాలు సాధించడంతో గురువారం ఆసిఫాబాద్ డిడి రమాదేవి పాఠశాల హెచ్ఎం పార్వతి ఉద్యోగులు ఆశిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి ఆధ్వర్యంలో జిల్లా టాపర్ విద్యార్థినిలకు శాలువలతో సన్మానం చేసి ఎమ్మెల్యే డిడి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిడి రమాదేవి,హెచ్ఎం పార్వతి, ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతూ వారికి కూడా శాలువలతో ఎమ్మెల్యే సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొవలక్ష్మి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల జైనూర్ విధ్యార్థులు 10 వరగతిలో ఆత్యధిక మార్కులు సాధించి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అన్నింటిలోను జైనూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల విధ్యార్థులు కుమ్రం భీం జిల్లా టాపర్ లుగా నిలవడం అభినందనీయమని అన్నారు.

అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా పాఠశాలలో 100% ఫలితాలు వచ్చే విధంగా కృషి చేసిన హెచ్ఎం ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఆ పాఠశాల పనితీరుపై ఎమ్మెల్యే అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆసిపాబాద్ మున్సిపాల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్,ఆసిఫాబాద్ డిటిడివో రామదేవి,జిసిడివో శకుంతల, ప్రదానోపాధ్యాయురాలు ఆత్రం పార్వతి, నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.