పది ఫలితాల్లో మండల టాపర్ యాసారపు శరణ్య
పది ఫలితాల్లో మండల టాపర్ యాసారపు శరణ్య
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం 10వ తరగతి ఫలితాలు వెలువడిన ఫలితాల్లో 600 మార్కులకు గాను 513 మార్కులు సాధించి మండల టాపర్ గా మండల కేంద్రానికి చెందిన యాసారపు రమణ లక్ష్మణ్ దంపతులకు చెందిన కుమార్తె చరణ్య నిలిచింది. ఏజిహెచ్ఎస్ అనంతొగు పాఠశాల్లోని మండల ద్వితీయ స్థానంలో తేజస్విని, తృతీయ హర్షియబేగం విజయ కెరటం సాధించారు. అనంతరం విద్యాధికారి కొమరం శాంతారావు ఫలితాలు వెల్లడించారు.
జడ్పిహెచ్ఎస్ పాఠశాల్లోని శరణ్య, హర్షియాబేగం, హబ్సిబా, నిహారిక, అమృత, వర్షిని, నవ్యశ్రీ, తేజస్విని,హారిక, సంతోష్, గణేష్ పాఠశాలలో ప్రథమ ద్వితీయ స్థానం సాధించారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు భద్రమ్మ, జెడ్పిహెచ్ఎస్ కాంప్లెక్స్ హెచ్ఎం ఎంఈఓ కొమరం శాంతారావు విద్యార్థుల ఉత్తీర్ణత సాధించేందుకు అహర్నిశలుగా కృషి చేయడం జరిగిందని తెలిపారు. మండల ఉపాధ్యాయులు అంకితభావంతో చేసిన శ్రమను కొనియాడుతూ, నిరంతర మార్గదర్శకత్వమే ఈఫలితాలకు కారణమన్నారు. వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు జెడ్పిఎస్ఎస్ పాఠశాల విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ పది ఫలితాల్లో విద్యార్థిని విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి టిపిటిఎఫ్ భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి జోగా రాంబాబు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హాతిరామ్, టిటిఎఫ్ మండల అధ్యక్షుడు ఇస్లావత్ నరేష్, పిఆర్టియు మండల అధ్యక్షులు దనసరి మోహన్ బాబు,మర్కోడు కాంప్లెక్స్ హెచ్ఎం బాబూలాల్ ప్రత్యేక అభినందన తెలిపారు.
