ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, స్నాక్స్ పంపిణీ…
ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, స్నాక్స్ పంపిణీ…
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ముఖ్య అనుచరుడు చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి – ధనలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, నల్లగొండ జిల్లా నకరికల్ నియోజకవర్గ పరిధి, చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు గురువారం నాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలగోని నరసింహ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధి హామీ కూలీలకు కూల్‌డ్రింక్స్ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జన్నపాల శ్రీను మాట్లాడుతూ, తీవ్ర ఎండల సమయంలో కూలీలు శరీరంలో నీరసం, అలసటకు గురికాకుండా ఉండేందుకు చల్లని పానీయాలు తీసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. కూలీల ఆరోగ్యం తమకు అత్యంత ముఖ్యమని, అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జనాపాల శ్రీను, మేడ బోయిన స్వాతి, యువత నాయకులు జనాపాల రాము, ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, జన్నపాల రేణుక, ఉడుము ఉడుగు లీలావతి, జనాపాల మల్లిక, రాచమల్ల సంధ్య, గురిజా మమత, రూపని వనజ, ఉయ్యాల లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
