15 years | వైభవ్‌కు షోయబ్ అక్తర్, కమిన్స్ ప్రశంసలు

15 years | వైభవ్‌కు షోయబ్ అక్తర్, కమిన్స్ ప్రశంసలు
100 years | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : 15 ఏళ్ల భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి స్వదేశంలోనే కాదు విదేశీ దిగ్గజ తాజా, మాజీ ఆటగాళ్లు ఆకాశానికి ఎత్తుతున్నారు. ఐఎల్ 2026లో వైభవ్ ఆట తీరును చూసి ఆశ్చర్యపోవడమే కాదు.. ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా వైభవ్ సూర్యవంశీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇలాంటి ఆటగాడు పాకిస్థాన్‌లో ఒక్కరు కూడా లేడని వ్యాఖ్యానించారు. వచ్చే 100 ఏళ్లలో కూడా అలాంటి ఆటగాడు పుట్టడం కష్టమని పేర్కొన్నారు. 15 ఏళ్ల వయసులోనే ఇంత భయంకరంగా ఆడుతూ, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలో సత్తా చాటడం అద్భుతమని కొనియాడారు. క్రీజులో వైభవ్ ఐదారు ఓవర్లు ఉంటే చాలు, బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతుందని అక్తర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్‌లో ఒక మెరిసే నక్షత్రం కాబోతున్నాడని, అతని ముందు పాకిస్థాన్‌లోని ఏ ఆటగాడూ సరిపోడని అక్తర్ ప్రశంసించారు
అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజం ప్యాట్ కమిన్స్ కూడా బుడ్డోడిపై ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్‌ను తన “కొత్త ఫేవరెట్ ప్లేయర్” అని పిలిచారు. వైభవ్ బంతిని చాలా గట్టిగా బాదుతాడని, అతడు ఆడే తీరు చూడటానికి చాలా సరదాగా ఉంటుందని కమిన్స్ కొనియాడారు. అతను బౌలర్లపై విరుచుకుపడిన తీరును చూస్తే ముచ్చటేస్తుందన్నారు. 15 ఏళ్ల వయసులోనే ఇంత పరిణతి, దూకుడు అద్భుతమని పేర్కొన్నారు.
రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ బుమ్రా, ప్యాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా వైభవ్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (IPL 3rd fastest) నమోదు చేసి సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనే 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో 357 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో నిలిచాడు.
