40 degrees | తెలంగాణలో భానుడు భగభగ

40 degrees | తెలంగాణలో భానుడు భగభగ
40 degrees | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ర్టంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో నిప్పుల కొలిమిలా మారుతోంది. ఉష్ణ తాపానికి ప్రజలు తట్టుకోలేక అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పది రోజులుగా అత్యధికంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి ఉదయం తొమ్మిది గంటల నుంచే జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. రాత్రి పదైనా వేడి తగ్గడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్లల్లో ఉన్నా ఉక్కపోతను తట్టుకోలేపోతున్నారు. ఈ ఎండలు మే చివరి వరకు తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ రోజు కూడా పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీలు నమోదైంది. అలాగే నిజామాబాద్‌లో 43.1, మహబూబ్‌నగర్ 42.4, మెదక్ 42, రామగుండం 41.5, హకీంపేట్ 41.1, నల్లగొండ 40, ఖమ్మంలో 40 డిగ్రీలుగా రికార్డయినట్లు వెదర్ రిపోర్ట్ వచ్చింది.
