Case | బెంగళూరులో అదుపులోకి తీసుకున్న కుప్పం పోలీసులు

Case | బెంగళూరులో అదుపులోకి తీసుకున్న కుప్పం పోలీసులు
Arrest | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) పూడి శ్రీహరిని చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కుప్పంకు తరలిస్తున్నట్లు సమాచారం.
పూడి శ్రీహరి అరెస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయనపై నమోదైన కేసు వివరాలు, అరెస్టుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

బెంగళూరులో అదుపులోకి తీసుకున్న అనంతరం ప్రత్యేక బృందం ఆయనను కుప్పం వైపు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. పోలీసులు ఈ వ్యవహారంపై మరింత సమాచారం సేకరిస్తుండగా, అరెస్టు వెనుక ఉన్న కారణాలపై ఆసక్తి నెలకొంది.
