own parents | ఆస్తి కోసం కూతురు ఏం చేసిందంటే….

own parents | ఆస్తి కోసం కూతురు ఏం చేసిందంటే….
own parents | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. చిలకలూరిపేటలో ఆస్తి వివాదం కారణంగా ఓ మహిళ తన సొంత తల్లిదండ్రుల ఇంటికే నిప్పుపెట్టిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అదృష్టవశాత్తూ తల్లిదండ్రులు సకాలంలో బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.
సమాచారం ప్రకారం.. ఆస్తి విషయంలో తల్లిదండ్రులతో కుమార్తెకు కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన ఆమె ఇంటికి నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది.
మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోని ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తమై వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుమార్తెపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
