నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు శుభాకాంక్షల వెల్లువ

నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు శుభాకాంక్షల వెల్లువ
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్‌ను తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) జిల్లా శాఖ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించడంతో పాటు, ప్రత్యేకంగా నోటుబుక్కులను అందజేసి అభినందనలు తెలియజేశారు.
టీటీయూ జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శెట్టి రవికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో.. విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అందించాల్సిన సహకారంపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీటీయూ పోషించిన చారిత్రాత్మక పాత్రను, జిల్లాలో యూనియన్ చేపడుతున్న విద్యాసంబంధిత కార్యక్రమాలను కలెక్టర్‌కు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బట్టు నరసింహారాజు, ఎం. శంకర్, జిల్లా కార్యదర్శులు ఎం. రాములు, తుల్జారాం, శాంతప్ప, జగన్మోహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నూతన కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, జిల్లా విద్యావ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని కోరారు.
