మక్తల్ నియోజకవర్గంలో మిన్నంటిన గులాబీ సంబరాలు

మక్తల్ నియోజకవర్గంలో మిన్నంటిన గులాబీ సంబరాలు
- గ్రామగ్రామాన జెండా పండుగ
మక్తల్, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గవ్యాప్తంగా పండుగలా జరిగాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామగ్రామాన పార్టీ శ్రేణులు గులాబీ జెండాలను ఆవిష్కరించి, మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా మంథన్ గోడ్ గ్రామంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని జెండా ఎగురవేశారు. పలు చోట్ల కేక్ కట్ చేసి జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటాలు, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి గులాబీ జెండా ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జి. ఆశన్న, పి. నరేందర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, శివ రెడ్డి, ఉప్పరి రాములు, కలాల్ రాములు గౌడ్, ఉప్పరి అశోక్ సాగర్, ఎస్. పాండు, వడ్ల రమేష్ చారి, ముష్టి రాజు, రాములు, ప్రవీణ్ గౌడ్, బోడి సిద్దుభ, ముడుమాల్ సత్య రెడ్డి, తుమ్మలంపు సురేష్ గౌడ్, జమ్మన్న, ఎర్ర మల్లేష్, గున్న మల్లేష్, ఉప్పరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
