HYD MARKET | పసిడి ప్రియులకు షాక్

HYD MARKET | పసిడి ప్రియులకు షాక్
HYD MARKET | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారత మహిళలు బంగారం కొనడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. బంగారంతో ఆభరణాలు చేయించుకొని అలంకరించుకోవడానికి ఇష్టపడుతుంటారు. బంగారు కొనుగోలులో భారత దేశం ముందుంటుంది. శుభకార్యం ఏదైనా గోల్డ్ కొనాల్సిందే. ముఖ్యంగా వివాహాల సమయంలో గోల్డ్ విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. వధువుకు ఆభరణాలు చేయించడానికి బంగారు దుకాణాలకు పరుగులు పెడుతుంటారు. ఇలాంటి సమయంలో బంగారం ధరలు తక్కువగా ఉంటే బాగుండు అని కొనుగోలు దారులు అనుకుంటారు. కానీ బంగారం ధరలు ఏ రోజు ఎలా ఉంటాయో తెలియడం లేదు. రోజు రోజు ధరల మార్పుతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ ధరలను చూసి ఏం కొంటాం బాబోయ్ అని నోరెళ్ల బెడుతున్నారు. గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గోల్డ్, సిల్వర్ రేట్లలో హెచ్చు తగ్గుదల చోటుచేసుకుంటున్నాయి.
అక్షయ తృతీయ తర్వాత వరుసగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరుగుతుండటంతో పసిడిప్రేమికుల్లో ఆందోళన కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో బంగారం ధరలు రెండు రోజుల పాటు తగ్గి.. మళ్లీ ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది.
ఏప్రిల్ 27న బంగారం ధరలు పెరిగాయి. గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.380 పెరిగి రూ.1,54,040 నుంచి రూ.1,54,420కి చేరింది. 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.350 పెరిగి రూ.1,41,200 నుంచి రూ.1,41,550గా ఉంది. 18 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.290 పెరిగి రూ.1,15,530 నుంచి రూ.1,15,820కి వచ్చింది.
కిలో వెండి ధర రూ.2,70,000గా ఉంది. తులం వెండి రూ.2,700కి లభిస్తోంది.
