బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పార్టీ జెండా ఆవిష్కరించిన కార్పొరేటర్ డీకే
కరీమాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రప్రభ) : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని 34 డివిజన్ శివనగర్ కార్పొరేటర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శివనగర్ కార్పొరేటర్ దిడ్డి కుమార్ స్వామిఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు బి ఆర్ ఎస్ అభిమానుల మధ్య జెండా ఎగరవేయడం జరిగింది. అనంతరం పండ్లు పంపిణీ చేశారు.