కూలీలు జాగ్రత్తలు పాటించాలి

కూలీలు జాగ్రత్తలు పాటించాలి
- ఎంపీడీవో
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: ఉపాధి హామీ పథకం కూలీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమ్మర్ పల్లి మండల అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పల్లె చెరువులో జరుగుతున్న పనులను సందర్శించి పరిశీలించారు. ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న కూలీలకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సోమవారం పంపిణీ చేశారు.
ఆనంతరం ఆయన ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ… వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపాధి కూలీలు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఎండలో పనిచేసే సమయంలో తరచూ నీరు తాగడం,తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం,మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, అవసరమైనప్పుడు ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా నీరసం, అలసట వంటి సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మంజురాణి,ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ రమ, మేట్లు తదితరులు పాల్గొన్నారు.
