బంకుల్లో భారీ క్యూ
పరకాలలో పెట్రోల్, డీజిల్ పాట్లు
పరకాల, ఏప్రిల్ 27 (ఆంధ్ర ప్రభ): పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో వినియోగదారులు క్యూ లైన్లతో వేచి ఉన్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని మాదారం కాలనీ సమీపంలోని పెట్రోల్ బంకు, హుజురాబాద్ రోడ్డు పెట్రోల్ బంక్, హనుమకొండ రోడ్డులోని పెట్రోల్ బంక్, వెల్లంపల్లి రోడ్డు లోని పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్, డీజిల్ వినియోగదారులు క్యూలైన్లలో వేచి ఉండడం జరిగింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లు అనధికార సమాచారంతో పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదో అన్న అనుమానంతో వినియోగదారులు బంకుల్లో ద్విచక్ర వాహనాలతో పాటు, ఇతర వాహనాలు పెట్రోల్, డీజిల్ పోయించుకోవడం కోసం క్యూలైన్లు కడుతున్నారు. డీజిల్ కోసం 50 లీటర్ల క్యాన్లను క్యూ లైన్ లో పెట్టి తీసుకెళ్లడం జరుగుతుంది. డీజిల్ కొరత ఉన్నట్లు బంకుల నిర్వాహకులు తెలుపుతున్నట్లు సమాచారం. దీంతో వినియోగదారులు ఉదయం నుండి భారీ క్యాన్లతో పట్టణంలోని ఆయా బంకులకు చేరుకుని పెట్రోల్ డీజిల్ తీసుకెళ్లడం జరుగుతుంది
