ట్రాక్టర్‌తో.. దుక్కి దున్నిన మంత్రి జూపల్లి…

ట్రాక్టర్‌తో.. దుక్కి దున్నిన మంత్రి జూపల్లి…

కొల్లాపూర్, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రతినిత్యం ప్రజా పరిపాలన ప్రజల మధ్యలో ఉంటూ బిజీ బిజీగా ఉండే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి తిని భూమిని చదును చేసే ప్రక్రియను చేపట్టారు. శనివారం కొల్లాపూర్ పట్టణ సమీపంలోని మంత్రి కృష్ణారావు సొంత పొలంలో ట్రాక్టర్‌కు పూజ చేసి తన పొలంలోఖరీఫ్ సీజన్ ముంగిట, తన సొంత వ్యవసాయ క్షేత్రంలో రైతు అవతారమెత్తి సాగు పనులకు శ్రీకారం చుట్టారు.

స్వయంగా ట్రాక్టర్‌ను నడుపుతూ పొలాన్ని దున్ని, విత్తనాలు వేసేందుకు నేలను సిద్ధం చేశారు. రైతుల కష్టాలు తనకు తెలుసని, రైతు దేశానికి వెన్నెముక అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవ‌‌సాయాన్ని లాభ‌‌సాటిగా మార్చి రైతును రాజును చేయ‌‌డ‌‌మే ల‌‌క్ష్యంగా ముందుకెళ్తున్నామ‌‌ని అన్నారు. సేద్యాన్ని లాభసాటిగా మార్చే సమగ్ర వ్యవసాయ విధానాలను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు.