బద్దం రాంరెడ్డికి ఎమ్మెల్యే సామెల్ నివాళులు

బద్దం రాంరెడ్డికి ఎమ్మెల్యే సామెల్ నివాళులు

మోత్కూర్, ఆంధ్రప్రభ
మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పద్మశాలి కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం రాంరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ శుక్రవారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య,జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు ఫైళ్ళ సోమిరెడ్డి ,జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మీనర్సింహా రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగొని రామచంద్రు గౌడ్, సింగిల్ విండో చైర్మన్ పేలంపూడి వెంకటేశ్వర్లు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి,చింతల విజయ్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ గనగాని శైలజ నర్సింహా,నాయకులు బద్దం నాగార్జున్ రెడ్డి,మందుల సురేష్,సుంకిశాల అనిల్,జినుకల కనకయ్య,అవిశెట్టి నాగరాజు, రాజాలు కుటుంబ సభ్యులు బద్ధం శ్రీనివాస్ రెడ్డి, బండారు అరుణ మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

బద్దం రాంరెడ్డికి ఎమ్మెల్యే సామెల్ నివాళులు

Leave a Reply