పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి..

పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి..

మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

దండేపల్లి, ఆంధ్రప్రభ : రైతులు పండించిన పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు, శనివారం దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో ఆయన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలతో కలసి,విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక క్వింటాలు ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదని మండి పడ్డారు, రైతులు ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండించి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువస్తే గన్ని చంచులు రాలేదని అనడం బాధాకరమైన విషయం అన్నారు. రైతును ఎండలో తిప్పుకొనేందుకు ప్రభుత్వం చూస్తోందా లేక అధికారులు చూస్తున్నారా అని అన్నారు.

ఈ వారంలో వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చదయకుంటే రైతులతోని ఆందోళ చేపడతామన్నారు. రైతు పండించిన పంటకు ఎలాంటి కోతలు లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని సూచించారు, అనంతరం ఇటీవల మండలం లోని కొండాపూర్ గ్రామానికి చెందిన కమ్మల సాయి కుమార్ అనే కౌలు రైతు చెందిన 2 ఎకరాల మొక్కజొన్న పిడుగు పాటుకు కాలిపోవడంతో అక్కడకి వెళ్లి రైతు తో మాట్లాడి ఆ ధైర్యపరిచాడు,కాలిపోయిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపిపి పసర్తి అనిల్ కుమార్.సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ అక్కల రవీందర్, నాయకులు, పత్తిపాక శ్రీనివాస్,గొట్ల భూమన్న, ముత్తినేని బుచ్చన్న,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply