అభివృద్ధి చేస్తున్నాం.. సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

అభివృద్ధి చేస్తున్నాం.. సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
-ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు, ఆంధ్రప్రభ: గత రెండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందని టిడిపి పార్టీ శ్రేణులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు.శుక్రవారం టిడిపి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి నియోజకవర్గ పరిశీలకులు బొక్సంపల్లి రామకృష్ణప్ప కమతం కాటమయ్య హాజరయ్యారు.
ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గ మండల స్థాయిలో ఇంకా పెండింగ్ లో ఉన్న పార్టీ కమిటీలు , పార్టీ అనుబంధ కమిటీల గురించి చర్చించారు. ఎక్కడెక్కడ ఇంకా కమిటీలు పెండింగ్ లో ఉన్నాయి. ఎలాంటి నాయకులకు పదవులు ఇవ్వాలన్న అంశాలు గురించి పరిశీలకులు సూచనలు చేశారు. గతంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారితో పాటు ఇప్పుడు కూడా యాక్టీవ్ గా ఉన్న వారికి మాత్రమే పదవులు ఉంటాయని స్పష్టం చేశారు. త్వరలోనే కమిటీల ఏర్పాటు పూర్తవుతుందని అన్నారు.నియోజకవర్గంలో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో రోడ్ల నిర్మాణాలు చేపట్టాం ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మండలాలు గ్రామాల వారీగా ఎంపిక చేయాలన్నారు.వాటిని ప్రాధాన్యత వారిగా చేపడుతామన్నారు. నిధులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ బలంగా ఉంటే మనం బాగుంటామని అందుకే పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ముఖ్యంగా మనం రెండేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
