నిరుపేదల సొంత ఇంటి కల సాకారం

నిరుపేదల సొంత ఇంటి కల సాకారం
- మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, ఆంధ్రప్రభ: నిరుపేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని అమలు చేస్తోందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో నిర్వహించిన గృహప్రవేశాల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, నూతన గృహాలను ప్రారంభించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల సంక్షేమ వారోత్సవాల’లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు అట్టహాసంగా జరుగుతున్నాయి.శివాయపల్లి గ్రామానికి చెందిన తోట లక్ష్మి నూతన గృహప్రవేశ వేడుకలో కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ప్రాధాన్యతనిస్తూ, ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని కలెక్టర్ వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. “ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిర్మాణంలో ఉన్న మిగిలిన ఇళ్లను కూడా త్వరగా పూర్తి చేయాలి.” అని అన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, హౌసింగ్ పీడీ మాణిక్యం, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.

